రాష్ట్రస్థాయి క్రీడలకు బెల్లంపల్లి మైనార్టీ విద్యార్థులు ఎంపిక

రిపోర్టర్: ramesh chitty స్థలం: బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ చాటారు. మంచిర్యాలలో నిర్వహించిన పోటీల్లో లాంగ్ జంప్లో సాయి ప్రీతి, షాట్పుట్లో అఫిఫా ఉన్నీసా ప్రథమ బహుమతి సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విద్యార్థుల విజయం పట్ల ప్రిన్సిపాల్ షగుఫ్తా ఫిర్దౌస్, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తూ వారికి అభినందనలు తెలిపారు.