పొలాల్లో చేరిన వరద వ్యర్థాలతో కుమిలిపోతున్న దారకొండ రైతన్నలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: జీ.కే.వీధి
అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం దారకొండలో కురిసిన భారీ వర్షాలకు రోడ్లపై ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తాచెదారం వరద నీటితో పంట పొలాల్లోకి చేరాయి. దాంతో రైతులే స్వయంగా ఆ వ్యర్థాలను తొలగిస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల పంటలకు, నేల నాణ్యతకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి పరిశుభ్రతా కార్మికుల ద్వారా ఈ చెత్తను తొలగించాలని గ్రామ రైతాంగం డిమాండ్ చేస్తోంది.