ఢిల్లీ డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్వేపై రోడ్డు పక్కన మొక్కల అపహరణ

రిపోర్టర్: సురేష్ స్థలం: బాగ్‌పత్

ఢిల్లీ డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్వేపై పోలీస్ స్టికర్ ఉన్న కారులో వచ్చిన వ్యక్తి రోడ్డు పక్కన మొక్కలను అపహరించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారిందని పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బాగ్పత్ పరిధిలో సెప్టెంబర్ 28వ తేదీన ఈ సంఘటన జరిగిందని సీసీటీవీ టేజ్ ద్వారా వెల్లడైంది. రన్నింగ్ ట్రాఫిక్ మధ్య ఎక్స్ప్రెస్వేపై కారు నిలిపి మొక్కలను తరలించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని బాగ్పత్ పోలీసులు స్పష్టం చేశారు.