ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ: భక్తులతో కిటకిటలాడుతున్న అమ్మవారి సన్నిధి
రిపోర్టర్: భాస్కర్
స్థలం: విజయవాడ
విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో మూడో రోజు శ్రీ దుర్గమ్మ తల్లి శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు అభయమిస్తున్నారని ఆలయ అధికారులు తెలిపారు. చేతిలో అమృత పాత్ర, గరిటె ధరించి అన్నప్రదాతగా కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారని వారు వెల్లడించారు. ఈ అలంకారం ఆహార సమృద్ధికి, అన్నదానానికి, మాతృమూర్తి కరుణకు ప్రతీకగా నిలుస్తోందని భక్తులు విశ్వసిస్తున్నారు.