కరెంట్ కోతలతో రైతులను గోస పెడుతున్న కాంగ్రెస్ సర్కార్

రిపోర్టర్: విజయ్ స్థలం: తెలంగాణ

కరోనా లాంటి తీవ్ర సంక్షోభంలోనూ కేసీఆర్ ప్రభుత్వం 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇవ్వడంతో పాటు రెండు పంటలకు రైతు బంధు అందించింది. కానీ నేడు ఉత్పత్తి సామర్థ్యం ఉండి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కరెంట్ కోతలు విధిస్తూ రైతన్నలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.