హైదరాబాద్ లో అమిత్ షా మహా పాదయాత్ర: బీజేపీ కౌంటర్ వ్యూహంతో కలకలం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో మహా పాదయాత్ర నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర నాయకులు తెలిపారు. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు మరియు శ్రేణుల్ లో ఉత్సాహం నింపేందుకు బషీర్ బాగ్ నుంచి ఎంజే మార్కెట్ వరకు ఈ యాత్ర సాగుతుందని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా సవరణపై కాంగ్రెస్, ఇండియా కూటమి చేస్తున్న ఆరోపణలు నిరాధారమని, కేవలం నకిలీ ఓట్ల తొలగింపు మాత్రమే చేపడుతున్నామని స్పష్టం చేశారు. ఈ యాత్ర నేపథ్యంలో పోలీసులు భారీ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.