రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు తక్షణమే శ్రీకారం చుట్టాలి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: బోనకల్
పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సీపీఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు డిమాండ్ చేశారు. బోనకల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో అనేక పేద కుటుంబాలు ఇళ్ల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒకే ఇంట్లో రెండు, మూడు కుటుంబాలు నివసించాల్సిన దుస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు. రాజకీయ జోక్యాలకు తావులేకుండా పారదర్శకంగా అర్హులైన ప్రతి కుటుంబానికి ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చొరవ తీసుకుని, రెండో విడత ఇళ్ల పంపిణీని తక్షణమే ప్రారంభించి పేదలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.