వాహన కొనుగోలుదారులకు భారీ షాక్: సెకండ్ హ్యాండ్ కారు డబ్బులు వెనక్కివ్వాలని ఆదేశం

రిపోర్టర్: కిరణ్ స్థలం: Punjab

సెకండ్ హ్యాండ్ కారు విక్రయంలో మోసానికి పాల్పడిన డీలర్ కు పంజాబ్ జిల్లా వినియోగదారుల కమిషన్ దిమ్మతిరిగే తీర్పునిచ్చింది. హైకోర్టులో బ్లాక్లిస్ట్ లో ఉన్న మారుతి వ్యాగన్ఆర్ కారును విక్రయించినందుకు గాను బాధితుడు ప్రదీప్ కుమార్ కు రెండు లక్షల యాభై రెండు వేల రూపాయలను తిరిగి చెల్లించాలని ఆదేశించింది. వాహనం యొక్క చట్టపరమైన స్థితిని ధృవీకరించకుండా విక్రయించడం సేవా లోపమేనని కమిషన్ స్పష్టం చేసినట్లు అధికారులు తెలిపారు.