ఒంగోలులో సంచలనం: వ్యాపారులను అడ్డుకుని రెండు కిలోల బంగారం దోపిడీ

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Ongole

ఒంగోలులో బుధవారం ఉదయం జరిగిన భారీ చోరీలో తమిళనాడు నుంచి బంగారం తరలిస్తున్న వ్యాపారులను దుండగులు అడ్డుకున్నారని పోలీసులు తెలిపారు. రైల్వే స్టేషన్ లో దిగి ఆటోలో వెళ్తున్న వారిని ఉపాస్ ఆస్పత్రి వద్ద కారుతో అటకాయించి కిడ్నాప్ చేశారని వెల్లడించారు. దక్షిణ బైపాస్ సమీపానికి తీసుకెళ్లి దాడి చేసి సుమారు రెండు కేజీల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారని, నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామని డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు స్పష్టం చేశారు.