రాహుల్ గాంధీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు
రిపోర్టర్: హరి
స్థలం: చండీగఢ్
మాక్ పార్లమెంట్లోనే రాహుల్ గాంధీ ప్రధానిగా ఉండిపోవాలని, నిజంగా దేశ ప్రధాని అయ్యే అవకాశం ఎప్పటికీ రాదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎద్దేవా చేశారు. పంజాబ్ లోని చండీగఢ్ లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం అబద్ధాలు చెప్పడం, సమాజంలో అరాచకం సృష్టించడమే రాహుల్ నైజమని దుయ్యబట్టారు. 1984 నాటి సిక్ కు వ్యతిరేక దాడుల బాధితులకు మోడీ ప్రభుత్వ హయాంలోనే పూర్తి న్యాయం జరిగిందని ఆయన స్పష్టం చేశారు.