బ్రిక్స్ సమ్మిట్ వేళ ఢిల్లీలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు
రిపోర్టర్: నరేష్
స్థలం: ఢిల్లీ
భారత రాజధాని ఢిల్లీలో సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు జరగనున్న బ్రిక్స్ సమ్మిట్ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు కీలక అడ్వైజరీ జారీ చేశారు. ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు, నియంత్రణలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రయాణికులు విమానాశ్రయం, రైల్వే స్టేషన్లకు వెళ్లేటప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.