బీసీసీఐ సెలెక్షన్ కమిటీ కొత్త ఛైర్మన్గా ప్రజ్ఞాన్ ఓజా నియామకం

రిపోర్టర్: విజయ్ స్థలం: Mumbai

బీసీసీఐ పురుషుల సెలెక్షన్ కమిటీ నూతన ఛైర్మన్గా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా బాధ్యతలు చేపట్టనున్నట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి. అజిత్ అగార్కర్ పదవీకాలం ముగియడంతో సీనియారిటీ ప్రాతిపదికన ఈ నియామకం జరిగినట్లు తెలిపారు. అలాగే కొత్త సభ్యుడిగా రమేష్ పవార్ను క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. ఈ కమిటీలో శివ్ సుందర్ దాస్, ఆర్పీ సింగ్, అజయ్ రాత్రా ఇతర సభ్యులుగా కొనసాగుతారని బోర్డు స్పష్టం చేసింది.