తెలుగుదేశం పార్టీలో చేరిన బోగోలు కీలక నేత శ్రీనివాసులు రెడ్డి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: కావలి
కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి భారీ బలం చేకూరింది. బోగోలు మండలానికి చెందిన వైఎస్సార్సీపీ కీలక నేత కర్తం శ్రీనివాసులు రెడ్డి ఆ పార్టీని వీడి టీడీపీలో చేరారు. కావలి పార్టీ కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి సమక్షంలో ఆయన పసుపు కండువా కప్పుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుపరిపాలనకు ఆకర్షితుడనై తాను పార్టీలో చేరినట్లు శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు.