ఓటరు జాబితా పేరుతో కొత్త సైబర్ మోసం: ప్రజలకు పోలీసులు తీవ్ర హెచ్చరిక
రిపోర్టర్: అశోక్
స్థలం: తెలంగాణ
ఓటరు జాబితా పేరుతో నకిలీ ఏపీకే ఫైళ్లను పంపుతూ సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసగిస్తున్నారని పోలీసులు తీవ్రంగా హెచ్చరించారు. అపరిచిత నంబర్ల నుంచి వచ్చే ఈ ఫైళ్లను డౌన్లోడ్ చేసుకుంటే ఫోన్‌పై పూర్తి నియంత్రణ సాధించి వ్యక్తిగత సమాచారంతో పాటు బ్యాంకింగ్ వివరాలను చోరీ చేస్తారని అధికారులు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి ఫైళ్లను ఓపెన్ చేయవద్దని, మోసపోతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు.