'ప్రధాని మోదీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు': వైఎస్ జగన్

రిపోర్టర్: శివ స్థలం: ఆంధ్రప్రదేశ్

దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ప్రధానికి అభినందనలు తెలియజేస్తూ.. మోదీకి పరిపూర్ణమైన ఆరోగ్యం, దీర్ఘాయుష్షు ప్రసాదించాలని, దేశ ప్రజలకు మరింతగా సేవలందించే శక్తిని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తన ఎక్స్ ఖాతాలో వైఎస్ జగన్ పేర్కొన్నారు.