రాజకీయ సంచలనం: క్షిపణుల పరిమితిని ఎత్తివేసిన ఇరాన్ రివల్యూషనరీ గార్డ్

రిపోర్టర్: గోపి స్థలం: టెహ్రాన్

బాలిస్టిక్ క్షిపణుల పరిధిపై ఇప్పటివరకు పాటిస్తున్న రెండు వేల కిలోమీటర్ల స్వీయ పరిమితిని పూర్తిగా ఎత్తివేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ అధికార ప్రతినిధి జనరల్ హోస్సేన్ మొహెబ్బి వెల్లడించారు. టెహ్రాన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అమెరికా, ఇజ్రాయెల్ నుంచి ఎలాంటి ముప్పు ఎదురైనా భౌగోళిక హద్దులతో సంబంధం లేకుండా స్పందిస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ హెచ్చరించిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటుచేసుకోవడం పశ్చిమాసియాలో తీవ్ర కలకలం రేపుతోంది.