రాష్ట్రస్థాయి అంగన్ మిలన్ కార్యక్రమంలో నాలుగో స్థానాన్ని దక్కించుకున్న యాదాద్రి మహిళా మోర్చా

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట మండలంలో యాదాద్రి భువనగిరి జిల్లా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా రాష్ట్రస్థాయిలో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన అంగన్ మిలన్ కార్యక్రమంలో విశేష కృషి చేసి రాష్ట్రవ్యాప్తంగా నాలుగో స్థానంలో నిలిచింది. ఈ విజయంపై జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మాధురి చంద్ర హర్షం వ్యక్తం చేస్తూ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.