రైతులను ఆదుకోవాలంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ కదంతొక్కింది
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం అర్బన్
చింతకాని మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని, పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ సీపీఐ నాయకులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. రైతులకు రుణమాఫీ, పింఛన్ల పెంపుతో పాటు పదకొండు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు అందజేశారు.