అమెరికా మధ్యంతర ఎన్నికల జోరు: ముందస్తు ఓటింగ్ లో ఐదు కోట్లు దాటిన పోలింగ్
రిపోర్టర్: మహేష్
స్థలం: Washington
అమెరికా మధ్యంతర ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో ముందస్తు ఓటింగ్ జోరుగా సాగుతోందని యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా ఎలక్షన్ ల్యాబ్ వర్గాలు వెల్లడించాయి. శనివారం నాటికి ముందస్తు ఓట్లు ఐదు కోట్లకు పైగా నమోదయ్యాయని, 2022 ఎన్నికలతో పోలిస్తే ఓటర్ల నుంచి భారీ స్పందన లభిస్తోందని తెలిపారు. టెక్సాస్ సహా పలు కీలక రాష్ట్రాల్ లో డెమోక్రాట్, రిపబ్లికన్ పార్టీల మధ్య హోరాహోరి పోటీ నెలకొందని నిర్వాహకులు స్పష్టం చేశారు.