గ్యారేజీ నుంచి పదహారు వేల కోట్ల సామ్రాజ్యానికి నిర్మాత నమిత్ ప్రయాణం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: ముంబై
హురున్ ఇండియా నివేదిక ప్రకారం ప్రముఖ నిర్మాత నమిత్ మల్హోత్రా కుటుంబ ఆస్తుల విలువ పదహారు వేల కోట్ల రూపాయలకు చేరిందని తేలింది. ఒక దశలో ఆర్థిక సంక్షోభంతో నష్టపోయినప్పటికీ పట్టుదలతో గ్లోబల్ వీఎఫ్ఎక్స్ రంగంలో ఆయన అగ్రస్థానానికి ఎదిగారని నివేదిక వెల్లడించింది. ముంబైలో చిన్న గ్యారేజీలో ప్రారంభమైన ప్రయాణం ఆస్కార్ అవార్డులు సాధించే స్థాయికి చేరుకుందని, ప్రస్తుతం భారీ బడ్జెట్తో రామాయణ సినిమాను తెరకెక్కిస్తున్నారని మీడియా తెలిపింది.