వ్యాపార, రియల్ ఎస్టేట్ రంగాల్లో సచిన్ టెండూల్కర్ భారీ పెట్టుబడులు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Maharashtra

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యాపార, రియల్ ఎస్టేట్ రంగాల్లో వ్యూహాత్మక పెట్టుబడులతో భారీగా సంపదను కూడబెడుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఆజాద్ ఇంజనీరింగ్‌లో పెట్టిన పెట్టుబడి వందల రెట్ల లాభాన్ని తెచ్చిపెట్టింది. తాజాగా మహారాష్ట్రలోని లోనావాలాలో రూ.63.69 కోట్ల విలువైన భారీ భూములను కొనుగోలు చేశారు. వివిధ కంపెనీల్లో వాటాలతో దేశంలోనే అత్యంత సంపన్న క్రికెటర్‌గా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు.