తుపాను ముప్పు నేపథ్యంలో విజయనగరం జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తం
రిపోర్టర్: హరి
స్థలం: విజయనగరం
తుపాను ముప్పు నేపథ్యంలో విజయనగరం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నా యి. నాగావళి నదికి వరద ప్రవాహం పెరుగుతుండటంతో తీర ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టర్ రాంసుందర్రెడ్డి కంట్రోల్ రూమ్లు, తహసీల్దార్ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు.