ఇసుక కొరత.. అసెంబ్లీలో ప్రస్తావించాలని ఎమ్మెల్యేకు విన్నపం
రిపోర్టర్: p.g. murthy
స్థలం: జన్నారం
జన్నారం మండలంలో తీవ్రమైన ఇసుక కొరతతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. దీనిపై ఎమ్మెల్యే బొజ్జు అసెంబ్లీలో ప్రత్యేకంగా ప్రస్తావించి, సమస్యను పరిష్కరించాలని మండల ప్రజలు కోరుతున్నారు.
మండలంలో 757 ఇళ్లు మంజూరైనా, ఎకో జోన్ నిబంధనలతో ఇసుక సేకరణ నిలిచిపోయింది. నిబంధనల సడలింపు కోసం పంపిన ప్రతిపాదనలపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో, ఎమ్మెల్యే జోక్యం చేసుకోవాలని లబ్ధిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.