అణు నిరోధక శక్తిని మరింత వేగంగా పెంచుతామన్న ఉత్తర కొరియా
రిపోర్టర్: నరేష్
స్థలం: ఫ్యోంగాంగ్
అమెరికా మరియు దక్షిణ కొరియా దేశాలు సంయుక్తంగా చేపట్టిన సైనిక విన్యాసాలు అణు యుద్ధ రిహార్సల్స్ లా ఉన్నాయని ఉత్తర కొరియా అధికారికంగా మండిపడింది. ఈ మేరకు అధికార పార్టీ డిప్యూటీ డైరెక్టర్ కిమ్ జోంగ్ సిక్ స్పందిస్తూ, తమ దేశాన్ని అణు దాడితో అణచివేయాలనే కుట్ర జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తమ అణు నిరోధక శక్తిని మరింత వేగంగా పెంచుకుంటామని ఆయన స్పష్టం చేశారు.