లైంగిక వేధింపుల కేసులో 'ఢీ' రాజు అరెస్ట్, రిమాండ్.
రిపోర్టర్: సునీల్
స్థలం: హైదరాబాద్
ప్రముఖ తెలుగు డ్యాన్స్ రియాలిటీ షో 'ఢీ 10' విన్నర్ డ్యాన్సర్ రాజును లైంగిక వేధింపుల కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. సినిమా అవకాశాల పేరుతో తనను వేధించాడంటూ ఓ యువతి మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రాజుకు రిమాండ్ విధించారు. ఈ వ్యవਹారాన్ని పోలీసులు గోప్యంగా ఉంచడం చర్చనీయాంశమైంది.