వైద్య రంగంలో మరో మైలురాయి: సంజీవని ఆస్పత్రిలో కొత్త పరికరాలు ప్రారంభం
రిపోర్టర్: కిరణ్
స్థలం: Kuchipudi
కుచిపూడి గ్రామంలోని రవి ప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఎనిమిదో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించినట్లు ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు. దుర్గాష్టమి వేడుకల సందర్భంగా ఆస్పత్రిలో సరికొత్త లాపరోస్కోపిక్ పరికరాలను అధికారికంగా ప్రారంభించామని వారు వెల్లడించారు. గత ఎనిమిదేళ్లలో రెండు లక్షలకు పైగా కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలు అందించామని, దాతల సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తరిస్తామని యాజమాన్యం పేర్కొంది. ఈ నూతన అత్యాధునిక పరికరాల ద్వారా శస్త్రచికిత్సల్లో మరింత కచ్చితత్వం సాధించవచ్చని స్పష్టం చేశారు.