నితీష్ కుమార్ రెడ్డిని భవిష్యత్తు కోసం సిద్ధం చేస్తున్న భారత్

రిపోర్టర్: అశోక్ స్థలం: న్యూఢిల్లీ

భారత క్రికెట్ జట్టులో గాయాలు మరియు ఫిట్‌నెస్ సమస్యల కారణంగా సరైన స్థిరత్వం కొరవడినట్లు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తెలిపారు. పేస్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని భవిష్యత్తు అవసరాల కోసం, ముఖ్యంగా ప్రపంచ కప్ ను దృష్టిలో ఉంచుకుని తీర్చిదిద్దుతున్నామని ఆయన స్పష్టం చేశారు. హార్దిక్ పాండ్యా అందుబాటులో లేని సమయంలో నితీష్ కు పూర్తి అవకాశాలు కల్పిస్తూ అంతర్జాతీయ క్రికెట్ లో అనుభవాన్ని గడించేలా చర్యలు తీసుకుంటున్నట్లు గంభీర్ పేర్కొన్నారు.