టాలీవుడ్లో చిన్న సినిమాల కష్టాలపై నటుడు షిరాజ్ మెహదీ ఆవేదన

రిపోర్టర్: రాజేష్ స్థలం: Hyderabad

తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా నటుడు, దర్శకుడు షిరాజ్ మెహదీ తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాలు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులను ప్రస్తావిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. బంజారాహిల్స్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తన ‘ఓ అందాల రాక్షసి’ చిత్రానికి థియేటర్లు కేటాయించడం లేదని ఆరోపించారు. నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారని, ఫిల్మ్ ఛాంబర్ స్పందించకపోవడంతో తాను ఒంటరి పోరాటం చేస్తున్నానని తేల్చిచెప్పారు.