నంద్యాల కేజీబీవీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
రిపోర్టర్: రాజేష్
స్థలం: నంద్యాల
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలోని కేజీబీవీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న బోయ ఎం. భవ్య (16) బాత్రూంలో ఫినాయిల్ తాగి ఆత్మహత్య చేసుకుంది. ఎం. లింగాపురం గ్రామానికి చెందిన ఈ విద్యార్థిని తెల్లవారుజామున ఈ దురాగతానికి పాల్పడగా, తోటి విద్యార్థినులు సిబ్బందికి సమాచారం అందించారు. కొత్తపల్లి పీహెచ్సీ నుంచి ఆత్మకూరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.