అక్టోబర్ మొదటి వారంలో ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

అగ్ర హీరో ఎన్టీఆర్ గాయం నుంచి కోలుకుంటున్నట్లు సమాచారం. అక్టోబర్ మొదటి వారంలో ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జూన్ లో సినిమాను విడుదల చేయాలనే సంకల్పంతో ఉన్న చిత్రబృందం, ప్రస్తుతం ఎన్టీఆర్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.