కొత్త నటీనటులతో డైరెక్టర్ మారుతి కొత్త సినిమా: నవంబర్లో షూటింగ్ ప్రారంభం
రిపోర్టర్: సునీల్
స్థలం: హైదరాబాద్
రాజసాబ్ సినిమా నిరాశపరచడంతో దర్శకుడు మారుతి కొత్త బాటపట్టారని, స్టార్ హీరోల కోసం ఎదురుచూడకుండా నూతన నటీనటులతో కొత్త సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమయ్యారని సినీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం స్క్రిప్ట్ పూర్తి చేసుకున్న ఆయన, నవంబర్లో షూటింగ్ ప్రారంభించి వేగంగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారని, వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.