తిరుమలాయపాలెం మండల లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: తిరుమలాయపాలెం
మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో సోమవారం తిరుమలాయపాలెం మండలానికి చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 114 మంది లబ్ధిదారులకు 35.56 లక్షల రూపాయల విలువైన చెక్కులను అందజేసినట్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని కార్యాలయ సిబ్బంది పేర్కొన్నారు.