బాక్సాఫీస్ వద్ద ఘన విజయం: హనుమాన్ అంశ్ చిత్ర నిర్మాణ బృందంలో విభేదాలు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Hyderabad

బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన హనుమాన్ అంశ్ చిత్ర నిర్మాణ బృందంలో విభేదాలు తలెత్తాయి. నీమ్ కరోలి బాబా బయోపిక్ గా తెరకెక్కిన ఈ సినిమాపై హక్కుల వ్యవహారంలో వివాదం నెలకొందని నమ్రతా జి సింగ్ మరియు దర్శకుడు డాక్టర్ విశాల్ చతుర్వేది వెల్లడించారు. ఈ మేరకు స్వయంభు మీడియా నెట్ వర్క్ ద్వారా వారు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అనధికారిక వ్యక్తుల ప్రచారాన్ని నమ్మవద్దని చిత్ర బృందం స్పష్టం చేసింది.