తిరుపతి మేయర్ ఎన్నికల నామినేషన్లలో ఉద్రిక్తత: పత్రాలు లాక్కున్న వైఎస్సార్సీపీ

రిపోర్టర్: కిరణ్ స్థలం: తిరుపతి

తిరుపతి మేయర్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు. కొర్లగుంట, బైరాగి పట్టెడ కేంద్రాల వద్ద వైఎస్సార్సీపీ నాయకులు హడావిడి చేస్తూ టీడీపీ మహిళా అభ్యర్థుల నామినేషన్ పత్రాలు లాక్కుని గందరగోళం సృష్టించారు. భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డిల దౌర్జన్యంపై కూటమి నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రెచ్చిపోతున్న వైఎస్సార్సీపీ శ్రేణులను కూటమి నాయకులు అడ్డుకోవడంతో సత్యనారాయణపురం, శ్రీకృష్ణనగర్ ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.