కంటి చూపు సమస్యను ఎదుర్కొంటూనే అద్భుతాలు సాధించిన స్టార్ బాస్కెట్ బాల్ క్రీడాకారుడు
రిపోర్టర్: రమేష్
స్థలం: California
స్టార్ బాస్కెట్ బాల్ క్రీడాకారుడు స్టీఫెన్ కర్రీ తన కెరీర్ లో కంటి చూపు సమస్యను ఎదుర్కొన్నట్లు పీపుల్స్ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. 2018లో తనకు కెరటోకోనస్ అనే అరుదైన కంటి వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయిందని, అప్పటివరకు స్పష్టమైన చూపు లేకపోయినా దానిని అధిగమించే ఆటను అలవాటు చేసుకున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ కంటి సమస్య కారణంగా మైదానంలో ఇబ్బంది పడినప్పటికీ, గోల్డెన్ స్టేట్ వారియర్స్ తరఫున అద్భుత విజయాలు సాధించి నాలుగు ఛాంపియన్షిప్లను కైవసం చేసుకోవడం విశేషమని ఆయన తెలిపారు.