కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, సీఎస్ శాంతి కుమారి పాల్గొన్నారు. పీఎంఏవై-జీ ఇండ్ల కేటాయింపులు, ఎల్నినో పరిస్థితులు, వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. మొదటి విడతగా తెలంగాణకు 2 లక్షల ఇండ్లు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు.