ప్రచారంలో నాయకులు కనిపించకపోవడంపై గ్రామాల్లో విస్మయం వ్యక్తం చేస్తున్న ఓటర్లు

రిపోర్టర్: పి రాజేష్ కుమార్ స్థలం: గంగాధర నెల్లూరు

ఎన్నికల ప్రచారం గ్రామాల్లో పెద్దగా కనిపించడం లేదనే చర్చ సాగుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించకపోవడంపై ఓటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లకుండా ఓట్లు ఎలా వస్తాయని మహిళలు సైతం గుసగుసలాడుకుంటున్నారు. మరోవైపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ తేదీని నవంబర్ ఐదుకి మార్చినట్లు అధికారులు సమాచారం అందించారు.