వర్షాల బీభత్సం: విజయనగరం జిల్లాలో చెరువుల గండ్లు పూడ్చక రైతుల అవస్థలు

రిపోర్టర్: రమేష్ స్థలం: విజయనగరం

వర్షాలు తగ్గినప్పటికీ విజయనగరం జిల్లాలో ప్రజల కష్టాలు తీరడంలేదని, చెరువులకు పడిన గండ్లను పూడ్చకపోవడంతో సాగు నీరు వృథాగా పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వంగర, సంతకవిటి మండలాల్లో వివిధ శాఖల పరిధిలో ఇరవై ఐదు కోట్ల రూపాయల వరకూ నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. అత్యవసర పనులు మాత్రమే చేపట్టిన యంత్రాంగం, శాశ్వత మరమ్మతులను విస్మరించడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోయారు.