భారత్, అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు: రక్షణ, ఇంధన రంగాల సహకారానికి అడుగులు

రిపోర్టర్: కృష్ణ స్థలం: ముంబై

భారత్, అమెరికా దేశాల మధ్య ఇంధన మరియు రక్షణ రంగాల సహకారాన్ని మరింత విస్తరించేందుకు కీలక చర్చలు జరిగాయని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వెల్లడించారు. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో జరిపిన భేటీలో వాణిజ్యం, సాంకేతికతపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. త్వరలోనే ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కొలిక్కి వస్తుందని రూబియో ఆశాభావం వ్యక్తం చేశారు. ముడి చమురు శుద్ధిలో భారత్ అగ్రగామిగా ఉందని ప్రశంసించారు.