రాయలసీమ అభివృద్ధికి సరికొత్త బాట: లక్ష కోట్లతో మెగా హార్టికల్చర్ హబ్

రిపోర్టర్: రమేష్ స్థలం: Madanapalle

రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా మారుస్తామని, రూ.లక్ష కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టును చేపడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి ఉద్యాన హబ్కు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. సాగునీరు అందిస్తే సీమ రైతులు బంగారు పంటలు పండిస్తారని, ఆరు లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలను విస్తరిస్తామని సీఎం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.