దీపావళి పండగ వేళ తీవ్ర అప్రమత్తత అవసరమంటూ అగ్నిమాపక అధికారి హెచ్చరిక
రిపోర్టర్: శివ
స్థలం: కొత్తవలస
దీపావళి పండగ విషాదాంతం కాకుండా ప్రతి ఒక్కరూ అగ్ని ప్రమాపాల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కొత్తవలస అగ్నిమాపక అధికారి అశోక్‌కుమార్ స్పష్టం చేశారు. బాణసంచా విక్రయదారులు తప్పనిసరిగా అన్ని అనుమతులు పొందాలని ఆయన సూచించారు. అత్యవసర పరిస్థితుల్ లో లేదా ప్రమాదాలు సంభవిస్తే వెంటనే 101 నంబరుకు లేదా స్థానిక అగ్నిమాపక కేంద్రాలకు ఫోన్ చేసి సమాచారం అందించాలని ప్రజలను ఆయన కోరారు.