అనంతపురంలో వైభవంగా కొనసాగుతున్న గణనాథుల నిమజ్జనోత్సవం
రిపోర్టర్: అశోక్
స్థలం: అనంతపురం
అనంతపురం నగరంలోని సప్తగిరి కూడలిలో గణేశ్ ఉత్సవాల్లో భాగంగా ఐదు రోజుల పాటు పూజలందుకున్న గణనాథుల నిమజ్జనోత్సవం శుక్రవారం వైభవంగా ప్రారంభమైంది. గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఎస్పీ జగదీశ్ పతాకాన్ని ఆవిష్కరించి పూజలు నిర్వహించారు. మేళాలు, తప్పెట్లు, తాళాలు, యువత కేరింతలు, నృత్యాలు మరియు వసంతోత్సవాల నడుమ సాగిన ఈ శోభాయాత్రలో మహిళలు, యువకులు పెద్దఎత్తున పాల్గొన్నారు. రాప్తాడు వంక, రాచానపల్లి, పంపనూరు హెచ్‌ఎల్‌సీ కాలువల్లో రాత్రి పొద్దుపోయే వరకు విగ్రహాల నిమజ్జనం కొనసాగింది.