ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టరేట్లో గ్రీవెన్స్ డే నిర్వహణ
రిపోర్టర్: పి రాజేష్ కుమార్
స్థలం: గంగాధర నెల్లూరు
చిత్తూరు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికతో పాటు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. వివిధ శాఖల అధికారులు హాజరయ్యే ఈ సదస్సును ప్రజలు తమ సమస్యల నివారణకు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.