తుఫాన్ వేళ గర్భిణుల రక్షణే పరమావధిగా అప్రమత్తమైన సీతంపేట వైద్య సిబ్బంది

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పాలకొండ

పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలంలోని అన్నవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ డీఎంహెచ్ఓ విజయపార్వతి సందర్శించారు. అర్నబ్ తుఫాన్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని వైద్య సిబ్బంది ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, గర్భిణుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అవసరమైన సందర్భాల్లో గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. తుఫాన్ సమయంలో విద్యుత్ అంతరాయం ఎదురైనా సేవలు నిరంతరం అందించాలని అధికారులను ఆదేశించారు.