సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వృద్ధులకు అన్నప్రసాదం అందించిన వైనం
రిపోర్టర్: KOLA MAHESH
స్థలం: నారాయణపురం
నల్గొండ జిల్లా చౌటుప్పల్ పరిధిలోని సాయి యాదాద్రి సేవా ఆశ్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాసేవ ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఈ సేవా సంకల్ప్ అభియాన్ చేపట్టారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన నాయకులు ఆశ్రమంలోని వ్వాతాతలకు స్వయంగా అన్నప్రసాదాన్ని అందజేశారు. పెద్దల ముఖాల్లో సంతోషం చూసి ఆనందం వ్యక్తం చేశారు.