వైద్య విద్య సీట్ల పెంపుపై బీజేపీ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం

రిపోర్టర్: అశోక్ స్థలం: Hyderabad

తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్ల పెంపు అంశంపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది. రాష్ట్రంలో కొత్తగా 1,010 సీట్లు పెరిగి మొత్తం 10,450 సీట్లు అందుబాటులోకి వచ్చాయని బీజేపీ ప్రకటించగా, ఆ అంకెలను బీఆర్ఎస్ ఖండించింది. తప్పుడు లెక్కలతో ప్రచారం చేస్తున్నారంటూ అధికారిక ఎక్స్ ఖాతా వేదికగా బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో మండిపడింది.