మన్యం అడవుల్లో గంజాయి, నాటుసారా స్థావరాలపై పోలీసుల సర్జికల్ స్ట్రైక్స్

రిపోర్టర్: అశోక్ స్థలం: విజయనగరం

పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో గంజాయి, నాటుసారా వ్యాపారంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. రెండేళ్లలో 25 వేల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, 1200 మందిని అరెస్ట్ చేశారు. డ్రోన్లతో నిఘా పెట్టి అటవీ ప్రాంతాల్లో లక్షలాది లీటర్ల నాటుసారా ఊటను ధ్వంసం చేశారు. మత్తు వ్యాపారంతో కోట్లు గడించిన కింగ్‌పిన్ల ఆస్తులను జప్తు చేసేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.