కామారెడ్డి జిల్లాలో మహిళ దారుణ హత్య కలకలం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: కామారెడ్డి
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం నాగారం గ్రామ శివారులో చింతకుంట అనసూయ అనే మహిళను కొర్పోల్ గ్రామానికి చెందిన గుట్టమీద సాయిలు ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేశాడు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. సహజీవనం చేస్తున్న నిందితుడు సాయిలు హత్య అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఎల్లారెడ్డి సీఐ రాజారెడ్డి, ఎస్సై దీపక్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.