కొత్తగా పదహారు లక్షల రేషన్ కార్డుల పంపిణీ అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టీకరణ
రిపోర్టర్: మహేష్
స్థలం: సూర్యాపేట
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన పేద కుటుంబాలకు కొత్తగా పదహారు లక్షలకు పైగా రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క కొత్త కార్డు కూడా ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో కోటికి పైగా రేషన్ కార్డులు ఉన్నాయని, అర్హులందరికీ ఆహార భద్రతతో పాటు సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.