రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతూ విద్యార్థుల ధర్నా
రిపోర్టర్: వెంకట్
స్థలం: కొమురం భీమ్ ఆసిఫాబాద్
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట మండలం లోడ్‌పల్లిలో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. రోడ్లు పూర్తిగా గుంతలుగా మారి పాఠశాలలకు వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమకు మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబుకు సమస్యను విన్నవించారు. ఈ నిరసనతో ఆ ప్రాంతంలో కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది.